: గూగుల్ లో రాజధాని వాసుల 'బీరు' విహారం!
దేశ రాజధాని ఢిల్లీ వాసులు బీరు ప్రియులంటోంది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్. వారికిష్టమైన డ్రింక్ బీరేనని, ఇటీవలి సెర్చ్ సరళి ఆ విషయాన్ని స్పష్టం చేస్తోందని గూగుల్ పేర్కొంది. వేసవి వారాంతాల్లో అత్యధికులు బీరు కోసమే అత్యధికంగా సెర్చ్ చేశారని, విస్కీ, బ్రాందీ కోసం తక్కువ మంది వెదికారని వివరించింది. ఏ సమయంలోనైనా ఓవరాల్ గా అత్యధికులు కోరుకుంటున్నది బీరేనని తేలింది. రమ్, వోడ్కా కూడా సెర్చింగ్ లిస్టులో ఉన్నా అవి బీరు తర్వాత ఎక్కడో అడుగున ఉన్నాయట. 2015 మే-జూన్ లో బీరు కోసం వెదుకులాట పతాకస్థాయికి చేరిందని గూగుల్ నివేదిక చెబుతోంది. 2014తో పోల్చితే ఇది చాలా ఎక్కువట. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తీరు నెలకొందని గూగుల్ పేర్కొంది.