: టాస్ గెలిచిన జింబాబ్వే, ఇండియా బ్యాటింగ్... ఒక్క పరుగుకే మురళీ విజయ్ అవుట్
భారత్, జింబాబ్వే మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా హరారేలో మొదలైన తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు కెప్టెన్ మసకజ్జా భారత్ ను బ్యాటింగుకు ఆహ్వానించాడు. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం ఒక్క పరుగు చేసిన ఓపెనర్ మురళీ విజయ్, విటోరీ బౌలింగులో సిబందాకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ దారి పట్టాడు. ప్రస్తుతం రహానే 31 బంతుల్లో 18 పరుగులు, అంబటి రాయుడు 20 బంతుల్లో 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత స్కోరు 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 32 పరుగులు.