: భారీ హ్యూమన్ ట్రాఫికింగ్ గుట్టు రట్టు... 20 మంది అమ్మాయిలను కాపాడిన పోలీసులు
వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన అమ్మాయిలను వ్యభిచార గృహాలకు అప్పగించేందుకు తీసుకెళ్తున్న ముఠాను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ లో 20 మంది యువతులను ఓ ముఠా తరలిస్తోందన్న సమాచారాన్ని అందుకున్న రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులతో కలసి దాడులు చేశారు. ఈ రైలులో తరలిస్తున్న 20 మంది యువతులను పోలీసులు కాపాడారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాకు చెందిన ఇద్దరు పురుషులను, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, పట్టబడ్డ యువతులను రెస్క్యూ హోంకు పంపనున్నామని పోలీసులు తెలిపారు.