: ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్ర సంపూర్ణ సహకారం ఉంటుంది: జవదేకర్


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని విభజన చట్టంలో పొందుపర్చారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. సీఎం చంద్రబాబుతో సమావేశం ముగిసిన తరువాత మంత్రి మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన అటవీ భూమిని డీనోటిఫై చేసి, చట్ట ప్రకారం భూములను అప్పగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలోని కొత్త ప్రాజెక్టులకు కూడా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ఈ విషయాలలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News