: ప్రభాస్ కు పాలాభిషేకం చేసిన అభిమానులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 'బాహుబలి' సందడే కనిపిస్తోంది. రాజకీయాలు, పుష్కరాల గురించి మాట్లాడుకునే వారే లేరు. ఏ ఇద్దరు కలసినా బాహుబలి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో, బాహుబలి చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. బ్యానర్లతో థియేటర్లు నిండిపోయాయి. నల్గొండలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రభాస్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. మరోవైపు, ఇదే జిల్లాలోని భువనగిరిలో ఓంకార్ థియేటర్ వద్ద ఓ మేకను బలి ఇచ్చారు.