: సాంకేతిక లోపంతో ఆగిన బాహుబలి ప్రదర్శన, కట్టలు తెంచుకున్న అభిమానుల ఆగ్రహం


సినిమాలను, సినిమా హీరోలనూ నెత్తిన పెట్టుకునే అభిమానులకే కోపం వస్తే... శాటిలైట్ ద్వారా తెరపై పడుతున్న సినిమా మధ్యలోనే ఆగిపోతే... ప్రకాశం జిల్లా పొదిలిలో నేడు అదే జరిగింది. బాహుబలి చిత్రం ప్రదర్శిస్తున్న హరికృష్ణ థియేటరులో సినిమా సాగుతున్న వేళ సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో సినిమా ప్రదర్శన నిలిచింది. ఐదు నిమిషాల పాటు చూసిన ప్రేక్షకులు ఇక తట్టుకోలేకపోయారు. గొడవకు దిగి కుర్చీలను విరగ్గొట్టారు. థియేటర్లోని ఫర్నీచరును ధ్వంసం చేశారు. 20 నిమిషాల పాటు బీభత్సం సృష్టించారు. పోలీసులకు విషయం తెలిసి వచ్చేలోగా సమస్య పరిష్కారమై ప్రదర్శన కొనసాగింది.

  • Loading...

More Telugu News