: హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చంద్రబాబు భేటీ


ఢిల్లీలో సీఎం చంద్రబాబు వరుస భేటీలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి కిందట కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీఎం భేటీ అయ్యారు. విభజన చట్టంలోని సెక్షన-8, పలు అంశాలపై ప్రధానంగా ఆయన చర్చించనున్నారు. తరువాత జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలుస్తారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ తో బాబు సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణానికి అటవీభూములు ఇవ్వాలని కోరినట్టు చంద్రబాబు తెలిపారు. డీనోటిఫై చేసి చట్టపరమైన అడ్డంకులు తొలగించాలని కోరామని, ఇందుకు మంత్రి జవదేకర్ సానుకూలంగా స్పందించారని అన్నారు.

  • Loading...

More Telugu News