: బంగ్లాదేశ్ లో తీవ్ర తొక్కిసలాట... 23 మంది మృతి
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా బంగ్లాదేశ్ లో చేపట్టిన వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో తీవ్రంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. అక్కడి మైమన్ సింగ్ పట్టణంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఈరోజు వస్త్రాలు పంపిణీ చేస్తోంది. ఇక్కడికి భారీస్థాయిలో జనం తరలిరావడంతో వస్త్రాలను తీసుకునే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ సమయంలో 23 మంది మరణించారు. అనేకమందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు.