: వచ్చే ఏడాది పాకిస్థాన్ లో మోదీ పర్యటన... స్వయంగా ఆహ్వానించిన పాక్ ప్రధాని


సరిహద్దు దేశం పాకిస్థాన్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించబోతున్నారు. వచ్చే ఏడాది ఆ దేశంలో సార్క్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, రష్యాలో మోదీతో భేటీ అయిన సమయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా ఆహ్వానించారు. ఇందుకు భారత ప్రధాని అంగీకరించారు. దాంతో వచ్చే సంవత్సరం మోదీ పాక్ పర్యటన ఖరారైంది. ఇరు ప్రధానుల సమావేశం ముగిసిన అనంతరం భారతదేశ విదేశాంగ కార్యదర్శి ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. దాదాపు గంటపాటు జరిగిన భేటీలో భారత్, పాక్ శాంతియుత ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు వివాదాలు, ముంబయి దాడుల ప్రధాన సూత్రదారి లఖ్వీ విడుదల, తదితర విషయాలపై కీలకంగా చర్చించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News