: బాహుబలి చూసేందుకు సెలబ్రిటీల ఆసక్తి... తొలిరోజే సినిమా చూసిన షారుఖ్ భార్య
అత్యంత భారీ బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'బాహుబలి'. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాదు, ఇతర భాషల సినీ అభిమానులు, చివరకు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హిందీలో ఈ సినిమాను విడుదల చేయడం... ఈ సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచింది. ఈ క్రమంలో, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ భార్య గౌరి ఖాన్ తొలిరోజే బాహుబలి చూశారు. అంతేకాదు, కారులో తాను సినిమాకు వెళ్తున్న ఫొటోలను కూడా ట్టిట్టర్ లో పోస్ట్ చేశారు.