: వచ్చే ఏడాది పవన్ కల్యాణ్ నిర్మాతగా నా సినిమా: హీరో చరణ్


తన బాబాయి, సినీ నటుడు పవన్ కల్యాణ్ నిర్మాణంలో హీరో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఆ సినిమా మొదలవుతుందని చెప్పారు. కాగా తన తండ్రి చిరంజీవి నటించే 150వ సినిమా నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్ తప్పుకోలేదని స్పష్టం చేశారు. కథ రెండో భాగంలో జాప్యం వల్లనే ప్రాజెక్టు ఆలస్యమవుతోందని వెల్లడించారు. తన ట్రూజెట్ విమాన సర్వీసుల వివరాలు వెల్లడించేందుకు హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెర్రీ పై విషయాలు తెలిపారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో తమ ట్రూజెట్ విమాన సర్వీసులను ప్రత్యేకంగా నడుపుతామని చరణ్ తెలిపారు. తమ టర్బో మెగా ఎయిర్ వేస్ కు అన్ని అనుమతులు వచ్చాయని తెలిపారు. వచ్చే మూడేళ్లలో సంస్థను మరింత విస్తరిస్తామని చెప్పారు. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ లో డిస్కౌంట్ తో విద్యార్థులకు 10 సీట్లు, సీనియర్ సిటిజన్స్ కు 10 శాతం డిస్కౌంట్, దక్షిణాది సినీ పరిశ్రమ, 'మా' సభ్యులకు కూడా 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఔరంగాబాద్ నుంచి షిర్డీకి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News