: అవసరమైతే నంద్యాలలో కాపురం ఉంటా!: ఫ్యాక్షనిస్టులకు సవాల్ విసిరిన కర్నూలు ఎస్పీ


కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లా నంద్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి, పోలీసులకు మధ్య వివాదం చెలరేగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ రవికృష్ణ ఘాటుగా స్పందించారు. నంద్యాలలో ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సంఘ వ్యతిరేక శక్తులతో కఠినంగా వ్యవహరిస్తానని, అవసరం అనుకుంటే తాను నంద్యాలలోనే కాపురం ఉంటానంటూ ఫ్యాక్షన్ వర్గాలకు సవాల్ విసిరారు. పోలింగ్ రోజున భూమా నాగిరెడ్డి డీఎస్పీ దేవదానంతో అనుచితంగా ప్రవర్తించారని, ఆయనను అవమానకరరీతిలో 'డోన్ట్ టచ్ మీ' అంటూ దూరం పెట్టే ప్రయత్నం చేశారని వివరించారు. అందుకే ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News