: మళ్లీ సొంతగూటికి సోమ్ నాథ్ చటర్జీ
సిద్ధాంతాలకు కట్టుబడిన రాజకీయవేత్తగా, లోక్ సభ స్పీకర్ గా మన్ననలు అందుకున్న సీపీఎం నేత సోమ్ నాథ్ చటర్జీ మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. గతంలో లోక్ సభ స్పీకర్ గా ఉన్నప్పుడు... యూపీఏ ప్రభుత్వానికి మద్దతు విరమించిన తర్వాత, స్పీకర్ పదవి నుంచి తప్పుకోవాలన్న పార్టీ ఆదేశాలను ఆయన ఒప్పుకోకపోవడంతో... పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, సీపీఎం లో సీతారామ్ ఏచూరి శకం మొదలైన తర్వాత కలుపుకుపోయే చర్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలో, సీపీఎం దిగ్గజం జ్యోతిబసు జయంతి సందర్భంగా కోల్ కతాలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సోమ్ నాథ్ చటర్జీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా, మళ్లీ పార్టీలోకి రావాలంటూ సోమ్ నాథ్ ను ఏచూరి కోరారు. ఈ పిలుపు పట్ల సోమ్ నాథ్ కూడా సానుకూలంగానే స్పందించారు.