: వారికిక గరిష్ఠంగా రూ. కోటి మాత్రమే ఇస్తారట!
ఆటగాళ్ల వేలంలో భాగంగా కోట్లాది రూపాయలను సొంతం చేసుకుంటున్న భారత క్రికెటర్లు దేశవాళీ టోర్నీల్లో ఆడేందుకు ఉత్సుకతను చూపించని వైనాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోంది. ఐపీఎల్ లో దేశవాళీ ఆటగాళ్ల ధరలను నియంత్రించాలని భావిస్తోంది. ఫ్రాంచైజీల స్థానిక ఆటగాళ్ల ధరలను కోటి రూపాయలకు మించకుండా ఉండేలా నిబంధన విధించాలని ఇప్పటికే బోర్డు సభ్యులు సూచించినట్టు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం వరకూ స్థానిక ఆటగాళ్లతో ఫ్రాంచైజీలు నేరుగా డీల్స్ కుదుర్చుకునేవి. గత సంవత్సరం నుంచి వారికి కూడా వేలం నిర్వహిస్తుండడంతో, ఆటగాళ్లకు కోట్లలో దక్కుతోంది. కాగా, ఆటగాళ్లను తిరిగి తీసుకునే విధానాన్ని కూడా మార్చాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. టీమ్ ఇండియా ఆటగాళ్లలో ఇద్దరు, విదేశీ ఆటగాళ్లలో ఇద్దరు, దేశవాళీ ఆటగాళ్లలో ముగ్గురిని మాత్రమే తుదిజట్టులోకి తీసుకునేలా నిబంధనలు మార్చే అవకాశాలున్నట్టు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా వివరించారు.