: ‘2జీ’ రాజా రూ.10 వేల కోట్లను దేశం దాటించారు...గుజరాత్ వజ్రాల వ్యాపారుల సహకారం!


దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన 2జీ స్పెక్ట్రం కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి ఏ. రాజా ఈ కేసు ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటించేశారట. ఇందుకోసం ఆయనకు గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారులు సహకరించారు. ఈ మేరకు కీలక ఆధారాలు సేకరించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజా గుట్టును రట్టు చేయడమే కాక, సహకరించిన వజ్రాల వ్యాపారులను అరెస్ట్ చేసింది. హవాలా బాటలో రాజా దేశం దాటించిన సొమ్ము రూ.10 వేల కోట్లని కూడా ఈడీ నిగ్గు తేల్చింది. భారత గూఢచార సంస్థ ‘రా’ అధికారుల సహాయంతో ఈడీ, రాజా హవాలా వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. 2జీ కేసులో అక్రమంగా కూడగట్టిన సొమ్మును డైమండ్ కంపెనీల సహాయంతో తొలుత దుబాయ్ లోని మైకాన్ జనరల్ ట్రేడింగ్ కంపెనీకి తరలించిన రాజా, ఆ తర్వాత హాంకాంగ్ కంపెనీలకు, అక్కడి నుంచి పన్నుల బాధలు లేని దేశాలకు తరలించారని ఈడీ తెలిపింది. రాజాకు సహకరించిన నలుగురు వజ్రాల వ్యాపారులను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News