: టీ సర్కారు ‘హరితహారం’లో మొక్కలు నాటిన రేవంత్ రెడ్డి!


తెలంగాణ సర్కారుపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి... కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో నిన్న పాలుపంచుకున్నారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి నెలరోజుల పాటు జైల్లో ఉండి వచ్చారు. ప్రభుత్వం తనను ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేసిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి బెయిల్ లభించిన అనంతరం తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. నిన్న అటు ప్రభుత్వాన్నే కాక, ఇటు సొంత పార్టీ నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ రేవంత్ రెడ్డి హరితహారంలో పాలుపంచుకున్నారు. అందులో భాగంగా కొడంగల్ లో ఆయన ఓ మొక్కను నాటి నీరు పోశారు.

  • Loading...

More Telugu News