: ఆ నరకం నుంచి ఆమెను 'బచ్ పన్ బచావో' రక్షించింది!


సమాజంలో చోటుచేసుకుంటున్న దారుణాలకు... నమ్మితే మోసపోతామని చెప్పడానికి... ఆడపిల్లను ఎంత జాగ్రత్తగా, సమర్థవంతంగా పెంచాలో తెలియచెప్పడానికి ఈ సంఘటన ఉదాహరణ. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ యువతిని జష్ పుష్ జిల్లా చూపిస్తానంటూ సోదరుడి వరుసయ్యే ఓ యువకుడు, గుమ్లా జిల్లా తీసుకొచ్చాడు. అక్కడ రోహిత్ అనే యువకుడికి అమ్మేశాడు. రోహిత్, అతని స్నేహితులు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అనంతరం ప్లేస్ మార్చారు. ఢిల్లీలోని ఓ ప్లేస్ మెంట్ ఆఫీస్ అపార్ట్ మెంట్ లో ఉంచి మూడు నెలలు దాష్టీకానికి ఒడిగట్టారు. వారు అనుభవించిందే కాకుండా, డబ్బుల కోసం వ్యభిచారం చేయించారు. ఇంతలో తమ కుమార్తెను తీసుకెళ్లిన యువకుడిపై అతని తల్లిదండ్రులు ఒత్తిడి పెంచారు. దీంతో అతను రోహిత్ ను సంప్రదించాడు. 30 వేల రూపాయలు ఇస్తే ఆమెను వదిలేస్తామని చెప్పారు. అయితే జరిగిన దానిని కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పకూడదని షరతు పెట్టారు. పొలం అమ్మగా వచ్చిన 30 వేల రూపాయలు రోహిత్ కు ఇవ్వడంతో తనను కుటుంబ సభ్యులకు అప్పచెప్పారని ఆ యువతి తెలిపింది. తరువాత కొంత కాలానికి జల్సాలకు అలవాటు పడిన రోహిత్, మరోసారి కిడ్నాప్ చేశాడని, ఆ సమయంలో ఛత్తీస్ గఢ్, ఢిల్లీ ముఖ్యమంత్రులకి, జాతీయ, ఢిల్లీ మహిళా కమీషన్లకు, ఢిల్లీ పోలీసులకు లేఖలు రాశానని ఎవరూ స్పందించలేదని చెప్పింది. తరువాత 'బచ్ పన్ బచావో ఆందోళన్' సభ్యులు తనను రక్షించారని 23 ఏళ్ల యువతి తెలిపింది.

  • Loading...

More Telugu News