: తెలంగాణలో కోటి రూపాయలు పలుకుతున్న ఎంబీబీఎస్ సీటు!


వైద్య విద్యకు ఎప్పుడైనా డిమాండ్ ఎక్కువే. సమాజంలో బాగా విలువ, గౌరవం ఉన్న వృత్తి వైద్యవృత్తి కావడంతో, ఎంసెట్ లో మంచి ర్యాంకు రాని వాళ్లు ఎంత వ్యయమైనా భరించి ఎంబీబీఎస్ చదివేందుకు మొగ్గుచూపుతుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 'బి' కేటగిరీ విభాగంలో ఎంబీబీఎస్ కోర్సు రేటు కోటి రూపాయలు పలుకుతోందంటేనే అర్థం చేసుకోవచ్చు... మెడిసిన్ పై క్రేజ్ ఎంత ఉందో! ఇంతకుముందు అది రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు పలికేదట. ఇక, పీజీ మెడికల్ సీట్లు కూడా రూ.కోటి పైమాటేనని తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 శాతం సీట్లు ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా, మిగతా 35 శాతం సీట్లు కేటగిరీ బి కింద, మిగిలిన సీట్లు ఎన్నారై కోటా కింద భర్తీ చేయాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News