: టీఆర్ఎస్ నేతలు 'ముదురు బేబీస్'!: ఆర్.కృష్ణయ్య సెటైర్


తెలంగాణ రాష్ట్రం ఏడాది బిడ్డ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో జరిగిన నిరుద్యోగ గర్జనలో ఆయన మాట్లాడుతూ, 'నిజమే, టీఆర్ఎస్ నేతలంతా ఏడాది బిడ్డలు, దశాబ్దాలుగా ఇతర పార్టీల్లో పదవులు అనుభవించిన నేటి టీఆర్ఎస్ నేతలు పసిగుడ్డులే' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 'వీరంతా ముదురు బేబీస్' అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన కుటుంబ సభ్యులకు, రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన కేసీఆర్, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఈయడా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ భాషలో మాట్లాడేందుకు సంస్కారం అడ్డు వస్తోందన్న ఆయన, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News