: వేధింపుల ప్రిన్సిపల్ పై తిరగబడిన విద్యార్థినులు
ఉత్తప్రదేశ్ లో వేధింపులకు పాల్పడుతున్న ప్రిన్సిపల్ కు విద్యార్థినులు తగిన శాస్తి చేశారు. మీరట్ లోని ఓ దంత వైద్య కళాశాలలో ప్రిన్సిపల్ హాస్టల్ లోని విద్యార్థినులపై వేధింపులకు దిగుతున్నాడు. అతని వేధింపులపై ఎలా స్పందించాలో తెలియని విద్యార్థులు మౌనంగా భరించారు. వారి మౌనాన్ని చేతకానితనంగా భావించిన సదరు ప్రిన్సిపల్ వేధింపుల పర్వాన్ని మరింత అధికం చేశాడు. దీంతో కళాశాల విద్యార్థినులు ఆగ్రహించారు. అతని తీరుపై మండిపడిన విద్యార్థులు కొందరు ఆయనను కళాశాల నుంచి బయటకు ఈడ్చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.