: గిల్గిత్-బల్టిస్తాన్ ను పాక్ లో కలపొద్దు...అది జమ్మూ కాశ్మీర్ లో అంతర్భాగం: పీవోకే ప్రధాని
గిల్గిత్-బల్టిస్తాన్ ను పాకిస్థాన్ లో కలపవద్దని పాక్ ఆక్రమిత కాశ్మీరు (పీవోకే) ప్రధాని చౌధరీ అబ్దుల్ మజీద్ స్పష్టం చేశారు. ముజఫరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, గిల్గిత్-బల్టిస్తాన్ ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో అంతర్భాగమని అన్నారు. దానిని విలీనం చేసే ఏ ప్రయత్నమైనా కాశ్మీరీల స్వయం నిర్ణయాధికారాన్ని ప్రతిపాదించిన ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, గిల్గిత్-బల్టిస్తాన్ ను పాకిస్థాన్ విలీనం చేసుకుని, దానిని ఫెడరల్ ప్రావిన్స్ గా మార్చనుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.