: ఈ ఆకారం వల్లే 'నియా' వదులుకున్నా: రానా


'బాహుబలి' వల్ల బాలీవుడ్ సినిమా 'నియా' అవకాశం వదిలేసుకున్నానని బహుభాషా నటుడు రానా తెలిపాడు. 'బేబీ' సినిమాలోని పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రానాను బాలీవుడ్ సినిమా ఎప్పుడు చేస్తావని అడగడంతో ఈ విషయం చెప్పాడు. 'బాహుబలి' సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబైలో మాట్లాడుతూ, ఈ సినిమాలో పాత్ర కోసం భారీకాయంతో కనిపించాల్సి వచ్చిందని, అయితే 'నియా'లో పాత్ర సున్నితంగా కనిపించాలని అందుకే నటించలేదని చెప్పాడు. విక్రమ్ ఫడ్నిస్ దర్శకత్వంలో 'నియా' రూపొందుతుందని రానా చెప్పాడు. ఇంకా ఎంత కాలం ఈ ఆకారంతో కనిపిస్తారని అడుగగా, 'బాహుబలి 2' వస్తుందని, దాని కోసం ఇంకొంత కాలం ఇలాగే కనిపించాలని రానా చెప్పాడు. 'బాహుబలి' లాంటి సినిమాలు ఎప్పుడంటే అప్పుడు రావని, అలాంటి సినిమా కోసం ఎంత త్యాగమైనా చేయొచ్చని రానా అభిప్రాయపడ్డాడు. నిజానికి ఈ సినిమాను ఏడాదిలో తీద్దామనుకుంటే మూడేళ్లు పట్టిందని చెప్పాడు.

  • Loading...

More Telugu News