: వ్యాపం స్కాంపై మౌనం వీడిన రాహుల్ గాంధీ... చౌహాన్ పై ఎందుకు చర్య తీసుకోరంటూ మోదీకి ప్రశ్నాస్త్రం
వ్యాపం కుంభకోణంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఇప్పటిదాకా ఈ కుంభకోణానికి సంబంధించి చాలా మంది మరణించడం తెలిసిందే. దీనిపై చాన్నాళ్లుగా మౌనం వహించిన రాహుల్ గాంధీ ఎట్టకేలకు నోరు విప్పారు. ఇంత జరుగుతున్నా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ స్కాంలో పాత్రధారులు, సూత్రధారులను ఎవ్వరినీ వదిలిపెట్టబోమని ఎన్నికల వేళ చెప్పిన మోదీ ఇప్పుడు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లలిత్ మోదీ, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి వ్యక్తులను ఎందుకు ఉపేక్షిస్తున్నారని దుయ్యబట్టారు. లలిత్ మోదీ వ్యవహారంలో బీజేపీ నేతలకూ పాత్ర ఉందని రాహుల్ అన్నారు. లలిత్ మోదీని భారత్ తీసుకురావాలని ఆయన ప్రధానిని డిమాండ్ చేశారు.