: సాకర్ టోర్నీ, చిత్రోత్సవాలు... బ్రిక్స్ కార్యకలాపాల విస్తరణకు మోదీ ఆరాటం
రష్యాలో బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆయా అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ... బ్రిక్స్ దేశాలకు ఓ క్రీడా మండలి ఉండాలని అభిలషించారు. అలాగే, బ్రిక్స్ దేశాల మధ్య సాకర్ పోటీలు జరగాలని, అన్నీ కలిసి వస్తే వచ్చే ఏడాది బ్రిక్స్ దేశాల ఫుట్ బాల్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుందని తెలిపారు. అంతేగాకుండా, బ్రిక్స్ దేశాలు ఫిలిం ఫెస్టివల్స్, ఫిలిం అవార్డులు నిర్వహించుకోవాలని ప్రతిపాదించారు. ప్రత్యేక ట్రేడ్ ఫెయిర్, అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.