: లంకలో టీమిండియా టూరు షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ
భారత జట్టు శ్రీలంక పర్యటన షెడ్యూల్ ను బీసీసీఐ ఖరారు చేసింది. ఆగస్టులో టీమిండియా శ్రీలంక వెళుతుంది. లంకతో మూడు టెస్టులు ఆడనుంది. తొలి టెస్టు ఆగస్టు 12 నుంచి 16 వరకు గాలేలో, రెండో టెస్టు ఆగస్టు 20 నుంచి 24 వరకు కొలంబో తమిళ్ యూనియన్ మైదానంలో, చివరి టెస్టు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు కొలంబో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో నిర్వహిస్తారు. ఈ పర్యటన కోసం టీమిండియా ఆగస్టు 3న లంక చేరుకుంటుంది. పర్యటన పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 2న స్వదేశానికి తిరిగి వస్తుంది.