: సండ్రను విచారిస్తున్న ఏసీబీ... జనార్దన్ ఎవరంటూ ప్రశ్నలు
ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తెలంగాణ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా ఫోన్ సంభాషణల్లో వినిపించిన పేర్ల గురించే విచారణ జరుగుతున్నట్టు సమాచారం. సండ్ర కాల్స్ లో జనార్దన్ అనే పేరు పలుమార్లు వినిపించిందన్న నేపథ్యంలో, జనార్దన్ ఎవరంటూ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటల వరకు సండ్ర విచారణ కొనసాగనుంది.