: ప్రాణహిత ప్రాజెక్టుపై కేసీఆర్, హరీష్ రావుకే అవగాహన లేదు: ఉత్తమ్


ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయన్న మంత్రి హరీష్ రావు మాటలకు టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు ఆ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్, హరీష్ కే అవగాహన లేదని ఎద్దేవా చేశారు. తుమ్మిడి హెట్టి నుంచి కాళేశ్వరం దగ్గరకు ప్రాజెక్టు మార్చడం సరికాదన్నారు. ప్రాజెక్టు స్వరూపమే మార్చడం వెనుక ఏదో మతలబు ఉందని గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో అనుమానం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుపై మూడు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News