: ఎవరు గర్జిస్తారు? ఎవరు బుజ్జగిస్తారు?...షరీఫ్, మోదీ సమావేశంపై ఉత్కంఠ


ప్రధాని నరేంద్ర మోదీతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ రేపు షాంఘైలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ప్రధానులు ఏఏ అంశాలపై చర్చించనున్నారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇరు దేశాల సమావేశాలను దృష్టిలో పెట్టుకుని భారత్ పై అణ్వాయుధ దాడికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పాక్ మంత్రి ప్రకటించిన నేపధ్యంలో, చర్చల్లోని అంశాలపై ఆసక్తి రేగుతోంది. 26/11 ఉగ్రదాడుల అనంతరం పాక్ సంబంధాల విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు చర్చలు జరుపుతామని ప్రకటించిన భారత్, కాశ్మీరు వేర్పాటువాదులతో పాక్ అధికారులు చర్చలు జరపడంతో, ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తటస్థ వేదికలపై తప్ప నేరుగా చర్చలు జరపడం మానేసిన భారత్, పాక్ ప్రధానులు రేపటి చర్చల్లో ఏఏ అంశాలు స్పృశించనున్నారనే విషయంపై ఊహాగానాలు ఆరంభమయ్యాయి. కాగా, రష్యాలో భారత్ ప్రధాని, పాక్ ప్రధానిని కలుస్తారని వార్తలు వెలువడగానే... బలూచిస్తాన్ కు చెందిన వివిధ తెగల తీవ్రవాదులు, మరికొన్ని తీవ్రవాద సంస్థలకు భారత్ నిధులు అందిస్తోందంటూ పాక్ నేతలు ఆరోపణలు సంధించారు. దీంతో షరీఫ్ తో చర్చల్లో మోదీ ఎలాంటి వైఖరి వ్యక్తం చేస్తారోనని అంతా ఎదురు చూస్తున్నారు. కాగా, పాక్ నేతల వ్యూహాత్మక వ్యవహార శైలిని నిశితంగా గమనిస్తున్న భారత విదేశాంగ, రక్షణ శాఖ నిపుణులు, భారత ప్రతినిధులకు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. దీంతో రేపటి సమావేశంలో ఎవరు గర్జిస్తారు? ఎవరు బుజ్జగిస్తారు? అనేది ఆసక్తి రేపుతోంది.

  • Loading...

More Telugu News