: ఆ నలుగురిలో నేనే చెత్త ఆటగాడిని: వింబుల్డన్ సెమీస్ ఆటగాడు


ఈ ఏడాది వింబుల్డన్ లో ప్రవేశించిన నలుగురు ఆటగాళ్లలో తానే చెత్త ఆటగాడినని ఫ్రెంచ్ ప్లేయర్ రిచర్డ్ గాస్కెట్ పేర్కొన్నాడు. క్వార్టర్ ఫైనల్ లో వావ్రింకాతో తలపడిన గాస్కెట్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ లో ఫేవరేట్ వావ్రింకాపై గాస్కెట్ 4-6, 6-4, 6-3, 4-6, 9-11 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు గంటలపాటు జరిగిన సుదీర్ఘ పోరులో అద్భుతమైన విజయం సాధించిన గాస్కెట్, సెమీ ఫైనల్ లో జకోవిచ్ ను ఢీ కొట్టనున్నాడు. అయితే క్వార్టర్స్ చేరుకున్న ముగ్గురు ఆటగాళ్లు దిగ్గజాలని, తాను మాత్రం అనామక ఆటగాడినని గాస్కెట్ పేర్కొన్నాడు. ఫెదరర్, జకోవిచ్, ఆండీ ముర్రేలు తిరుగులేని ఛాంపియన్లని పేర్కొన్న గాస్కెట్, సెమీస్ లో జకోవిచ్ ను ఓడించడమే లక్ష్యమని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News