: మహబూబ్ నగర్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన టీఆర్ఎస్
రేపు మహబూబ్ నగర్ జిల్లా బంద్ కు అధికార టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ సీడబ్ల్యూసీకి చంద్రబాబు లేఖ రాయడాన్ని నిరసిస్తూ బంద్ కార్యక్రమాన్ని చేపట్టింది. బంద్ సందర్భంగా, జిల్లాలోని ప్రజలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, విద్యాసంస్థల అధిపతులు సహకరించాలని టీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ బంద్ ద్వారా తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకోవాలనుకున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని విన్నవించారు.