: ఉగ్రవాది భత్కల్ వింత ప్రవర్తన... పోలీసుల్లో అనుమానాలు!
చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ గత రెండు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నాడట. నేటి ఉదయం విచారణ నిమిత్తం రంగారెడ్డి కోర్టుకు తీసుకురాగా, న్యాయమూర్తి ఎదుటకు ఓ గులాబీ పువ్వుతో భత్కల్ హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ రకమైన నవ్వు నవ్వుతూ పోలీసులకు పలు అనుమానాలు రేకెత్తించాడట. భత్కల్ వింత ప్రవర్తన దేనికి దారితీస్తుందోనన్న సందేహాలు పోలీసు శాఖలో వ్యక్తమవుతున్నాయి. కాగా, తనను విడిపించేందుకు ఐఎస్ఐఎస్ కృషి చేస్తోందని, త్వరలోనే బయటకు వస్తానని భత్కల్ జైల్లోని టెలిఫోన్ నుంచి భార్యకు, స్నేహితులకు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో భత్కల్ ను ఉంచిన బ్యారక్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.