: నమ్మిన డ్రాగనే కాటేసింది... పచ్చి నిజాలివి!


నమ్మి మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లను 'చైనా డ్రాగన్' తన నిప్పుల మంటల్లో మసిచేసింది. ప్రపంచదేశాల ఇన్వెస్టర్లను గడగడలాడిస్తున్నది ఇప్పుడు గ్రీస్ కాదు... చైనా. మూడు వారాల వ్యవధిలో 3.5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 220 లక్షల కోట్లు) పెట్టుబడిదారుల సంపదను ఆవిరి చేసేసింది. గత నెల గరిష్ఠంతో పోలిస్తే చైనా స్టాక్ మార్కెట్ 32 శాతం పడిపోవడమే ఇందుకు కారణం. చైనా మార్కెట్ పతనం నేపథ్యంలో కొన్ని వాస్తవాలు... * గత మూడు వారాల్లో చైనా నష్టపోయిన మొత్తం భారత స్థూలజాతీయోత్పత్తి కన్నా అధికం. * గ్రీస్ చేసిన మొత్తం రుణంతో పోలిస్తే ఇది 20 రెట్లు ఎక్కువ. * చైనాలో 1,331 కంపెనీలు తమ ట్రేడింగను నిలిపివేశాయి. * మొత్తం మార్కెట్ విలువలో 40 శాతం విలువైన వాటాలు 'ఫ్రీజింగ్' స్థితిలో ఉన్నాయి. * జూన్ 12తో పోలిస్తే షాంగై సూచిక 32 శాతం దిగజారింది. * చైనా కమ్యూనిస్టు పార్టీలో సభ్యులకన్నా మార్కెట్లో ఇన్వెస్టర్ల సంఖ్య అధికం. * షాంగై కాంపోజిట్లో మార్జిన్ రుణం ఏడాదిలో 5 రెట్లు పెరిగింది. మార్కెట్ బుడగ పగలడానికి ఇదీ కారణమే.

  • Loading...

More Telugu News