: ఐదు తెలంగాణ జిల్లాల్లోని పాఠశాలలకు పుష్కరాల సెలవులు
గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణలోని ఐదు జిల్లాల పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు గుర్తించిన పాఠశాలలకు మాత్రమే సెలవులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సెలవులను ఏప్రిల్ 2016 వరకు ప్రతి రెండో శనివారంను పనిదినంగా మార్చి భర్తీ చేస్తామని తెలిపింది.