: ఆ వెబ్ సైట్లన్నీ ఆపేస్తామని సుప్రీంకోర్టుకు మోదీ సర్కారు హామీ


సభ్య సమాజానికి తలనొప్పిగా మారిన పోర్న్ (అశ్లీల) వెబ్ సైట్ల నిరోధానికి శాయశక్తులా కృషి చేస్తామని, అన్ని రకాల చర్యలనూ తీసుకుంటామని సుప్రీంకోర్టుకు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు హామీ ఇచ్చింది. అశ్లీల వెబ్ సైట్ల విషయంలో కేంద్రం స్పందించడం లేదని సుప్రీంను ఆశ్రయిస్తూ, దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. కేంద్రం చర్యలు అసంతృప్తిని కలిగిస్తున్నాయని గతంలో ధర్మాసనం వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా, ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చింది. అశ్లీల సైట్లను ఆపేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News