: అక్కడికి ప్రభాస్ వస్తాడో రాడో...!: కృష్ణంరాజు


ఈ దఫా గోదావరి పుష్కరాలకు ప్రభాస్ వస్తాడో రాడో చెప్పలేనని రెబల్ స్టార్ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. 2003లో ప్రభాస్ తనతో కలసి పుష్కర స్నానం చేశాడని గుర్తు చేసుకున్న ఆయన రేపు బాహుబలి విడుదల సందర్భంగా తాను కూడా బిజీగా ఉన్నానని, 19వ తేదీన రాజమండ్రి, కోవూరు ఘాట్లలో పుష్కర స్నానం చేస్తానని వివరించారు. తన జీవితంలో మూడు సార్లు గోదావరిలో పుష్కర స్నానం చేశానని వెల్లడించిన ఆయన, గత పుష్కరాల్లో కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తూ, దగ్గరుండి పనులు పర్యవేక్షించానని తెలిపారు. తాను నటించిన ఎన్నో చిత్రాలు గోదావరి నేపథ్యంగా, ఈ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్నాయని గుర్తు చేసుకున్న ఆయన, ప్రజలకు పుష్కర శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే గోదావరిపై ఓ డాక్యుమెంటరీని తీయనున్నట్టు కృష్ణంరాజు వివరించారు. ప్రభాస్ రాజమండ్రి పుష్కరాలకు వస్తే సెక్యూరిటీ సమస్యలు తలెత్తవచ్చని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News