: ప్రజా ప్రతినిధులూ...మా ఆత్మగౌరవాన్ని కించపరచవద్దు: కర్నూలు జిల్లా ఎస్పీ


విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడిని ఎదుర్కొంటున్న తమ ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ సీనియర్ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మొన్న పోలీసులపై విరుచుకుపడిన వైనాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాల పోలింగ్ కేంద్రం వద్ద భూమా పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ దేవదానంతో ‘డోన్ట్ టచ్ మీ’ అంటూ భూమా హూంకరించారు. దీంతో భూమాపై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసులో భూమాకు బెయిల్ మంజూరు చేసిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కోర్టు, చిన్నపాటి విషయాలకే కేసు నమోదు చేయడం కుదరదని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చిన ఎస్పీ, డీఎస్పీలు నాటి ఘటనను వివరిస్తూనే తమ ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించరాదని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News