: తెలంగాణ వ్యాప్తంగా 109 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 109 బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని, లేకుంటే బ్లడ్ బ్యాంకులను సీజ్ చేస్తామని డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. అంతకుముందు రాష్ట్రంలోని 132 బ్లడ్ బ్యాంకుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించి, 109 బ్యాంకులు అక్రమాలకు పాల్పడ్డట్టు తేల్చారు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలకు పూనుకున్నారు.