: ఇనుప ఖనిజం అక్రమాలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం...పలు రాష్ట్రాలలో సోదాలు
ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేటి ఉదయం ముమ్మర సోదాలకు శ్రీకారం చుట్టింది. ఒడిశాతో పాటు పశ్చిమబెంగాల్, తమిళనాడుల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభించింది. వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తిన ఈ కేసులో ఇప్పటికే పలు సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజాగా నేటి ఉదయం ప్రారంభమైన సోదాల్లో ఆయా సంస్థలకు చెందిన ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ ఈడీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.