: ప్రైవేటు వ్యక్తులతో చెత్త తరలించండి... జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ లో మున్సిపల్ కార్మికుల సమ్మెతో నగరంలో చెత్తా, చెదారం ఎక్కడిదక్కడే పేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెత్త తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోందంటూ రాజశ్వేరి అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. వెంటనే ప్రైవేటు వ్యక్తులతో చెత్త తరలించాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఇప్పటికే చెత్త తొలగించే చర్యలు చేపట్టామని, పూర్తిగా తరలించేందుకు వారం రోజుల సమయం కావాలని గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కోరారు. ఇందుకు అంగీకరిస్తూ కోర్టు గడువు ఇచ్చింది.