: హైకోర్టుకు చేరిన ‘బాహుబలి’ టికెట్ల విక్రయం... రేపు విచారణకు వచ్చే అవకాశం


విడుదలకు ముందే సంచలనాలు రేపుతున్న టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’ టికెట్ల విక్రయ వ్యవహారం హైకోర్టు గడప తొక్కింది. బ్లాక్ లో వేల రూపాయలు పలుకుతున్న ఈ చిత్రం టికెట్ల విక్రయాలపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సినీ ప్రేక్షకుల సంఘం అధ్యక్షుడు నరసింహారావు ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ల వద్ద ‘బాహుబలి’ టికెట్ల విక్రయం సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనం తండోపతండాలుగా రావడంతో తొక్కిసలాటతో పాటు పోలీసుల లాఠీ చార్జీ జరిగింది. వీటన్నింటినీ నరసింహారావు తన పిటీషన్ లో ప్రస్తావించారు. భారీ అంచనాలతో విడుదలవుతున్న చిత్రాలకు సంబంధించి పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోని కారణంగా అభిమానులు చనిపోతున్న వైనంపై నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటీషన్ రేపు విచారణకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News