: ఈనెల 24న అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ పాదయాత్ర


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 24న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా, ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను రాహుల్ పరామర్శిస్తారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. జిల్లాలోని నల్లమాడ నుంచి ఓడిచెరువు వరకు రాహుల్ పాదయాత్ర చేస్తారని వెల్లడించారు. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రఘువీరా విరుచుకుపడ్డారు. దోచుకోవడం, దాచుకోవడమే చంద్రబాబు పనిగా మారిందని విమర్శించారు. విభజన చట్టంలోని 138 సెక్షన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న దాడిని ఖండిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News