: పవన్ కల్యాణ్ పెట్టిన 'నానీ' లింక్ ఓపెన్ కావడం లేదు!


గత సంవత్సరం మార్చి 17న పార్లమెంటు ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు వచ్చినప్పుడు ఐదుగురు ఎంపీలు మినహా మరెవరూ లేరంటూ, తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్... ఎంపీ కేశినేని నాని లోక్ సభ హాజరు వివరాలు, అడిగిన ప్రశ్నల సంఖ్యను పరిశీలించాలని లింకును పెట్టారు. అయితే, ఈ లింకును క్లిక్ చేస్తే 'పేజ్ నాట్ ఫౌండ్' మెసేజ్ వస్తుండడం గమనార్హం. కేశినేని నాని గురించిన వివరాల కోసం పీఆర్ఎస్ ఇండియా డాట్ ఓఆర్ జీ వెబ్ సైటులోని ఎంపీ ట్రాకింగ్ లింకును ఆయనిచ్చారు. రెండు నిమిషాల వ్యవధిలో రెండు లింకులను పవన్ కల్యాణ్ ఉంచగా, అవి రెండూ ఓపెన్ కావట్లేదు. లింక్ ఓపెన్ కాకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News