: మైక్రోసాఫ్ట్ నుంచి 7,800 మంది ఇంటికెళ్లక తప్పదు: ఉద్యోగులకు సత్య నాదెళ్ల మెయిల్


పునర్వ్యవస్థీకరణలో భాగంగా చేయనున్న మార్పుల వల్ల సుమారు 7,800 మంది ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో తెలిపారు. నోకియా ఫోన్ల వ్యాపారాన్ని విలీనం చేసుకున్న తరువాత నష్టపోయామని ఆయన అన్నారు. ఫోన్ల వ్యాపారంపై తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావాలను తాను తెలియజేయాలని అనుకుంటున్నానని, ఈ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. నోకియా కోసం వెచ్చించిన నిధుల మొత్తాన్ని రైటాఫ్ చేయనున్నామని, దీనికి అదనంగా మరో రూ. 5 వేల కోట్ల వరకూ రీస్ట్రక్చరింగ్ వ్యయాన్ని భరించాల్సి వుందని ఆయన తెలిపారు. సత్య నాదెళ్ల మెయిల్ తరువాత ఎవరి ఉద్యోగం ఊడుతుందోనని మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News