: 'వ్యాపం' స్కాంలో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి చౌహాన్ పరామర్శ


వ్యాపం కుంభకోణంలో మరణించిన జర్నలిస్టు అక్షయ్ సింగ్ కుటుంబ సభ్యులను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పరామర్శించారు. ఈ ఉదయం ఢిల్లీలో వారి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మీ కుమారుడిని తిరిగి తెచ్చివ్వలేమని, అయితే మీ కుటుంబానికి మాత్రం ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. అక్షయ్ సోదరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. అయితే చౌహాన్ చేసిన ఆఫర్ ను జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు తిరస్కరించినట్టు సమాచారం. ఈ స్కాంలో పరిశోధనాత్మక కథనం రాసే క్రమంలో అక్షయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News