: మాకు ఆ యుద్ధనౌక కావాలి: చంద్రబాబు


ఐఎన్ఎస్ విరాట్... ఇండియాలోని పురాతన యుద్ధనౌకల్లో ఒకటి. ఐఎన్ఎస్ విరాట్ జీవితకాలం వచ్చే సంవత్సరంతో పూర్తవుతుంది. దీన్ని తమ రాష్ట్రానికి ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరుతున్నారు. కాకినాడ వద్ద సముద్రతీరంలో దీన్ని నిలిపి 'తేలియాడే మ్యూజియం'గా వాడుతూ, టూరిజాన్ని ప్రోత్సహిస్తామని ఆయన ప్రతిపాదించారు. విశాఖపట్నం వద్ద సబ్ మెరైన్ మ్యూజియం ఉన్నట్టుగానే, కాకినాడ వద్ద వార్ షిప్ మ్యూజియంను ఏర్పాటు చేయాలన్నది తమ ఉద్దేశమని, ఐఎన్ఎస్ విరాట్ ను తమకు అప్పగించాలని ఆయన కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. విరాట్ కన్నా ముందు సేవలందించిన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకను 1997లో తుక్కుగా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో విక్రాంత్ ను సైతం కాపాడాలని కొందరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ కు పట్టిన గతిని విరాట్ కు పట్టనివ్వకూడదని భారత నౌకాదళం సైతం భావిస్తుండడంతో, బాబు కోరిక తీరి కాకినాడ తీరం మరో ఆకర్షణీయ ప్రాంతం అవుతుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News