: బాహుబలి టిక్కెట్లను బ్లాక్ చేస్తున్నందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై కేసు నమోదు
ఓవైపు బాహుబలి చిత్రాన్ని చూసేందుకు అభిమానులు థియేటర్ల వద్ద భారీ స్థాయిలో క్యూలు కట్టి పోలీసులతో దెబ్బలు తింటుంటే, మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమా టికెట్లను బ్లాక్ చేశారని కేసు నమోదైంది. బాహుబలికి కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటరుగా ఉన్న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్ద సంఖ్యలో టికెట్లను బయటకు రానీయకుండా చేశారన్నది దిల్ రాజుపై అభియోగం. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 4 వేల స్క్రీన్ లపై విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారనడంలో సందేహం లేదు.