: ఏసీబీ అధికారుల కస్టడీలోకి సండ్ర... న్యాయవాది సమక్షంలో విచారణ
ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చర్లపల్లి జైలు నుంచి హైదరాబాదులోని బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు న్యాయవాది సమక్షంలో సండ్రను విచారించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ సమయంలో ఓ వైద్యుడు, ప్రత్యేక వసతులు కూడా సండ్రకు అందుబాటులో ఉంటాయి. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారమంతా సండ్ర ద్వారానే నడిచిందంటున్న ఏసీబీ... కీలక సమాచారం రాబట్టే కోణంలోనే ప్రశ్నలు సంధించనుంది. మరోవైపు సండ్ర బెయిల్ పై ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.