: అమెరికా గగ్గోలు... నిలిచిన స్టాక్ మార్కెట్, ఆగిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానాలు


అమెరికాలో అనూహ్య ఘటనలు జరిగాయి. వరల్డ్ హ్యూజ్ మార్కెట్ గా పేరున్న ఎన్ వైఎస్ఈ (న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజి) సాంకేతిక లోపాలతో నిలిచిపోయింది. షేర్లలో లావాదేవీలు జరగలేదు. ముందస్తు ఆర్డర్లన్నీ రద్దయ్యాయి. అయితే, ఇది సైబర్ దాడి కాదని, సాంకేతిక సమస్యేనని అధికారులు వ్యాఖ్యానించారు. ప్రముఖ ఫైనాన్షియల్ మేగజైన్ వాల్ స్ట్రీట్ జర్నల్ వెబ్ సైట్ డౌన్ అయింది. సరిగ్గా ఇదే సమయంలో ప్రభుత్వరంగ యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానాల్లోనూ టెక్నాలజీ మొరాయించింది. ఎక్కడి విమానాలను అక్కడే దించేయాల్సి వచ్చింది. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానాలను నిలిపివేయాల్సిన పరిస్థితి. తమ రౌటర్లలో ఏర్పడిన సమస్య కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని యునైటెడ్ ఎయిర్ లైన్స్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మూడు ఘటనలకూ సంబంధం లేనప్పటికీ, అన్నీ ఒకే సమయంలో జరగడంతో అమెరికా వాసులకు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. అధ్యక్షుడు ఒబామా స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఇది ఎటువంటి సైబర్ దాడి కాదని చెప్పిన యూఎస్ ఆర్థిక శాఖ వర్గాలు సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించాయి. ఎప్పుడు ట్రేడింగును పునరుద్ధరిస్తారన్న విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News