: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు
పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేత, దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై చింతమనేని, తన అనుచరులతో కలిసి నిన్న దాడి చేసిన సంగతి తెలిసిందే. తహశీల్దార్ తో పాటు ఆమె వెంట వచ్చిన రెవెన్యూ సిబ్బందిపైనా చింతమనేని అనుచరులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై తహశీల్దార్ వనజాక్షి ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేనిపై పోలీసులు ఐపీసీ 353, 334, 379 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.