: చంద్రబాబు జపాన్ పర్యటన ముగిసింది... తిరుగుపయనమైన ఏపీ సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జపాన్ పర్యటన కొద్దిసేపటి క్రితం ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు జపాన్ ప్రధానిని ఆహ్వానించే నిమిత్తం మూడు రోజుల క్రితం చంద్రబాబు ఆ దేశ పర్యటనకు వెళ్లారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, కీలక శాఖల ఉన్నతాధికారుల బృందంతో జపాన్ వెళ్లిన చంద్రబాబు అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహించారు. ఊహించిన దాని కంటే ఎక్కువగానే అక్కడి పారిశ్రామికవేత్తలు స్పందించారు. ఏపీలో పెట్టుబడులకు అక్కడికక్కడే ఒప్పందాలు కూడా కుదిరాయి. కొద్దిసేపటి క్రితం అక్కడ తన పర్యటనను ముగించుకున్న చంద్రబాబు తన ప్రతినిధి బృందంతో కలిసి స్వదేశం బయలుదేరారు.